*ఉన్నవా గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో పెంకుటిల్లు కాలిన ఘటన
ఉన్నవ అక్షర విజేత
ఎడ్లపాడు మండల పరిధిలోని ఉన్నవ గ్రామంలో ఈరోజు దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ పెంకుటిల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా కాలిపోయింది.ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో పల్లపోతుల పోలిరాజు అనే వ్యక్తి మాత్రమే నివాసం ఉండేవారని సమాచారం.ఆయన రోజువారి కూలీ పని నిమిత్తం తరచూ గుంటూరుకు వెళ్ళివస్తూ ఉండేవారని గ్రామస్థులు తెలిపారు.ఘటన సమయంలో ఎవ్వరు ఇంట్లో లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అయితే ఇంటి ఆస్తికి భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది.పూర్తి సమాచారానికి తెలియాల్సి ఉంది.